ఆమె రెమ్యూనరేషన్ అంటే మాటలా.. 100 పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి!
on Oct 14, 2022
హైపర్ ఆది అంటే పంచ్ ల ప్రవాహం అని మరో సారి నిరూపించుకున్నాడు. ఆ పంచ్ లు ఏంటో లేటెస్ట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. దీపావళి రాకముందే కమెడియన్స్ అందరూ టు టీమ్స్ గా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు పేల్చుకున్నారు. బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్ , రాకింగ్ రాజేష్, సన్నీ ఒక టీమ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు.
"మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. మా అబ్బాయిలని వదిలేయండి.. లేకుంటే రక్తపాతాలే" అంటూ ఇమ్మాన్యూల్ కామెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో హాకీ స్టిక్స్ పట్టుకుని వచ్చి "ఎవర్రా ఈ మంగళవారంగాళ్ళను శుక్రవారం పెట్టింది" అంటూ బులెట్ భాస్కర్ టీమ్ మీద విరుచుకు పడేసరికి రష్మీ "నేనే పెట్టాను" అంది. దాంతో బులెట్ భాస్కర్ మధ్యలో కల్పించుకుని.. "ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మీ.. పద.. నీ పేమెంట్ నేను ఇంటికి పంపిస్తా" అని కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసరికి " నువ్వు రష్మీకి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి" అంటూ ఆది కౌంటర్ వేసాడు.
ఇక ఈ డైలాగ్ జడ్జెస్ అంతా నవ్వేశారు. తర్వాత రాకెట్ రాఘవ వేసిన లేడీ గెటప్ అదిరిపోయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
